ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (19:29 IST)

నయనకు చీర అయినా.. బికినీ అయినా అదిరిపోతుంది.. శ్రీహరి భార్య

nayanathara
ఇండస్ట్రీలో హీరోయిన్లు ధరించి దుస్తుల గురించి దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్‌లో ఆకట్టుకున్న డిస్కో శాంతి.. శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. తాజా ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ.. సినిమాలలో హీరోయిన్లు గ్లామర్‌గా కనిపించడం చాలా అవసరమని చెప్పింది. 
 
కానీ వారు ఎంపిక చేసుకునే దుస్తులను బట్టి వారి గ్లామర్ అనేది కనిపిస్తుందని చెప్పుకొచ్చింది. కొంతమంది నిండుగా దుస్తులు ధరించినా కూడా అందంగా కనిపించరు. మరికొంతమంది ఎక్స్‌పోజ్ చేసినా కూడా అందంగా కనిపిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. 
 
ఈ క్రమంలో నయనతార గురించి మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్‌లో కానీ ఆఫ్ స్క్రీన్ లో కానీ నయనతార ఎటువంటి దుస్తులు ధరించిన చాలా అందంగా, గ్లామర్‌గా కనిపిస్తుంది. ఆమె సెలక్షన్ చాలా బాగుంటుంది. శ్రీరామరాజ్యం సినిమాలో నిండుగా చీర కట్టుకున్న అందంగా ఉంది. 
 
అలాగే బిల్లా సినిమాలో బికినీ ధరించినా కూడా అందంగానే కనిపించింది. ఎలాంటి దుస్తులు వేసుకున్నామన్నది ముఖ్యం కాదు… మన శరీరానికి నప్పే దుస్తులు వేసుకోవడం చాలా ముఖ్యం అంటూ వెల్లడించింది.