సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 28 అక్టోబరు 2018 (18:17 IST)

యాంకర్ రవి నన్ను చంపేస్తాడేమో... డిస్ట్రిబ్యూటర్ మొర...

బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న యాంకర్ రవి వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా డిస్ట్రిబ్యూటర్ సందీప్‌తో యాంకర్ రవికు ఆర్థికపరమైన లావాదేవీలున్నాయ్. తీసుకున్న బాకీని తిరిగి సందీప్ చెల్లించకపోవడంతో కోపోద్రిక్తుడయ్యాడు రవి. అప్పు తీర్చకుంటే అంతు చూస్తానంటూ రవి తన అనుచరులతో కలిసి కమలాపురికాలనీలోని సందీప్ కార్యాలయంలోకి జొరబడి బీభత్సం సృష్టించారు. 
 
ఇనుపరాడ్లతో 20 మంది వ్యక్తులు వచ్చి తనను బెదిరింపులకు గురిచేశారని.. ఫోన్‌లో కూడా రవి దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సందీప్. సందీప్ నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్.ఆర్. నగర్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని కొద్దిసేపు విచారించారు. 
 
అవసరమైతే విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పి యాంకర్ రవిని వదిలిపెట్టారు పోలీసులు. యాంకర్ రవి తన కార్యాలయంలో గొడవకు దిగిన వీడియో ఫుటేజ్‌ని త్వరలోనే బయటపెడ్తానంటున్నాడు డిస్ట్రిబ్యూటర్ సందీప్. తన ప్రాణానికి ముప్పు ఉందని యాంకర్ రవి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నాడు బాధితుడు సందీప్.