Widgets Magazine

బ్రాహ్మణకులంలో పుట్టి అందరివాడినయ్యా... హిందూ విరోధిగా చిత్రీకరిస్తున్నారు: కమల్

బుధవారం, 8 నవంబరు 2017 (09:53 IST)

kamal haasan

తాను బ్రాహ్మణకులంలో పుట్టినప్పటికీ దర్శకదిగ్గజం కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేశాక తాను అందరివాడినయ్యానని హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. అందువల్ల 'నేనూ హిందువునే.. కానీ నన్ను హిందూ విరోధిగా చిత్రీకరిస్తున్నారు. హిందువుల్లో అతివాదం నాకు భయం కలిగించింది. ఆ తప్పును ఎత్తిచూపించడం తప్పెలా అవుతుంది. నన్ను నాస్తికుడు అన్నా ఒప్పుకోను. ఎందుకంటే అది ఆస్తికులు పెట్టిన పేరు' అంటూ ఆయన స్పష్టం చేశారు. 
 
మంగళవారం తన జన్మదినోత్సవం సందర్భంగా కుమార్తె అక్షరాహాసన్‌తో కలిసి ఓ హోటల్లో కమల్‌ విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల తాను చేసిన హిందూ తీవ్రవాదంపై ఆయన వివరణ ఇచ్చారు. పనిలోపనిగా రాజకీయ పార్టీ స్థాపనపై కూడా స్పష్టత ఇచ్చారు. ఏ మతమైనా హింసకు పాల్పడకూడదని, హిందూ తీవ్రవాదం అన్న పదం తాను వాడలేదని అన్నారు. కానీ, హిందూ విరోధిగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. 
 
రాజకీయ పార్టీ కార్యాచరణ సన్నాహాల్లోనే తాను ఉన్నానని, అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదని అన్నారు. 'నేను పుట్టడానికి గల కారణం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. సమాజంలో లోపం ఏమిటంటే... ఏం చెయ్యాలో అది చెయ్యడం లేదు. తప్పు చేసినవాళ్లని తప్పించకపోతే మంచి ఎలా జరుగుతుంది? నిజాయితీ గల అభ్యర్థులనే ఎంపిక చేస్తాను' అని అన్నారు. జనవరి తరువాత తన రాజకీయ కార్యాచరణను ఒక్కొక్కటిగా వెల్లడిస్తానని ఈ విశ్వనటుడు ప్రకటించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లై నెలైంది.. సమంత కోసం.. మళ్లీ వంట చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ ...

news

యు.ఎస్‌.లో తెరకెక్కిన 'ప్రేమ మధురం..'

గోవర్ధన్‌ గజ్జల దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత ...

news

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు చూసి హడలిపోతున్న యువహీరోలు.. ఎందుకు?

జూనియర్ ఎన్‌టిఆర్. ప్రతి సినిమాలోను కొత్త గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ...

news

రాత్రి అయితే నా గదికి వచ్చి కౌగిలించుకోవాలని కోరేవాడు: బాలీవుడ్ నటి స్వర భాస్కర్

బాలీవుడ్ నటి.. వీరే దీ వెడ్డింగ్ హీరోయిన్ స్వర భాస్కర్ నోట వేధింపుల మాటలొచ్చాయి. ఓ ...