గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (17:33 IST)

party song : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నుంచి ఎనర్జిటిక్ పార్టీ సాంగ్

Srikakulam Sherlock Holmes Energetic party song
Srikakulam Sherlock Holmes Energetic party song
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ కి రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిచారు. ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
 
ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి శకుంతలక్కయ్యా సాంగ్ ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ ఎనర్జిటిక్ పార్టీ బీట్స్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మాస్ ని ఆకట్టుకున్నాయి. సింగర్ ఉమా నేహా పవర్ ఫుల్ వోకల్స్ మరింత ఎనర్జీని తీసుకొచ్చాయి.  ఈ సాంగ్ లో మాస్ డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. పెర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించిన ఈ పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది.  
 
అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ, అవినాష్ గుర్లింక్ ఎడిటర్. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజేష్ రామ్ బాల్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయం సాధించిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.  
 
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయి ఇద్రీమా నాగరాజు, MVN కశ్యప్.