'ఎఫ్-2' మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

fun song
Last Updated: ఆదివారం, 6 జనవరి 2019 (12:21 IST)
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఎఫ్-2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నారు.

వెంకీ, వరుణ్‌లు ఈ చిత్రంలో తోడళ్లుళ్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు.

తాజాగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో 'ఫ‌న్' అనే లిరిక‌ల్ సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. వెంకీ, త‌మ‌న్నా కెమిస్ట్రీ బాగుంద‌ని చెబుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మితమైన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

దీనిపై మరింత చదవండి :