ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:37 IST)

ఓటర్లకు డబ్బులు ఇవ్వకపోతే రాముడు కూడా గెలవలేడు : ఆర్ఎస్ఎస్ నేత

గోవా రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ మాజీ చీఫ్ సుభాష్ విలైంగ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి కాలంలో ఓటర్లకు డబ్బులు ఇవ్వకుంటే ఆ శ్రీరాముడు కూడా గెలవలేడని వ్యాఖ్యానించారు. గోవా రాజధాని పనాజీల

గోవా రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ మాజీ చీఫ్ సుభాష్ విలైంగ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి కాలంలో ఓటర్లకు డబ్బులు ఇవ్వకుంటే ఆ శ్రీరాముడు కూడా గెలవలేడని వ్యాఖ్యానించారు. గోవా రాజధాని పనాజీలో గోవా సురక్ష మాంచ్ ఆధ్వర్యంలో జరిగిన యూత్ కన్వెన్షన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
 
ఎన్నికల సమయంలో ప్రతి నేతా రెండు అంశాలపై దృష్టిసారిస్తారని చెప్పారు. అందులో ఒకటి యువత కాదా, రెండోది మహిళలని చెప్పారు. యువత, మహిళలకు డబ్బులు, బహుమతులు రాజకీయ నేతలు ఆశ చూపుతారని సుభాష్ చెప్పారు. అందుకే నేటి రాజకీయాల్లో డబ్బుకు అధిక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. 
 
ఇపుడున్న పరిస్థితుల్లో డబ్బును ఖర్చు చేయకపోతే ఇప్పుడు శ్రీరాముడు వచ్చి పోటీ చేసినా గెలువడు అని సుభాష్ వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా ఇతర పార్టీల రాజకీయ విధానాలను అనుసరిస్తుందని సుభాష్ తప్పుబట్టారు. గోవాలో సీఎం మనోహర్ పారికర్ ఇద్దరు మంత్రులను కేబినెట్ తొలగించడం బాధాకరమన్నారు. 
 
ఒకవేళ అనారోగ్య కారణాలతోనే ఆ ఇద్దరు మంత్రులను తొలగిస్తే.. మరి అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ పరీకర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సుభాష్. ముఖ్యమంత్రి పదవి నుంచి పరీకర్‌ను ఎందుక్ తొలగించలేదని ఆయన ప్రశ్నించారు.