Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పబ్లిక్‌లో అమ్మాయితో ఆ పనిచేసి సారీ చెప్పిన హీరో

గురువారం, 23 నవంబరు 2017 (15:26 IST)

Widgets Magazine

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పోలీసులకు సారీ చెప్పారు. ముంబై రోడ్లపై ఈ బాలీవుడ్ హీరో చేసిన పనికి పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఆయన దిగివచ్చిన క్షమాపణలు చెప్పారు. ఇంతకీ వరుణ్ ధావన్ ఏం చేశారో తెలుసుకుందాం?
varun dhawan
 
తాజాగా వరుణ్ ముంబై రోడ్లపై తన కారులో ప్రయాణిస్తుండగా, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగింది. ఆసమయంలో ఆయన కారు పక్కన ఓ ఆటో ఆగింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతి.. వరుణ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయింది. ఆయన సెల్ఫీ కావాలంటూ ప్రాధేయపడింది. దీంతో ఆ హీరో ఫ్యాన్ మాట కాదనలేకపోయారు. వెంటనే కారులో నుంచే సెల్ఫీ తీశారు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఇది ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అమర్చిన సీసీటీవీలో నమోదైంది. వెంటనే ముంబై పోలీసులు ఆ ఫోటోను జతచేసి ఓ ట్వీట్ చేశారు. "ఈ తరహా అడ్వంచర్లు సిల్వర్ స్క్రీన్‌పై అయితే బాగా పని చేస్తాయి కానీ ముంబై రోడ్లపై కాదు. నీ లైఫ్‌ని రిస్క్ చేయడమేకాకుండా.. మరికొందరి లైఫ్స్‌ని కూడా రిస్క్‌లో పెట్టావు. నీవంటి యూత్ ఐకాన్‌ నుంచి ఓ మంచి విధేయతను ఆశిస్తున్నాం. ఈ-చలాన్ మీ ఇంటికి వెళుతోంది. మరోసారి ఇలా జరిగితే మేము కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది" అంట వరుణ్‌కు ముంబై పోలీసులు ఓ స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు. 
 
దీనికి వరుణ్ స్పందించారు. "నా క్షమాపణలు.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు మా కార్లు కదలవు.. ఓ అభిమాని సెంటిమెంట్‌ను కాదనలేకపోయాను కానీ ఈ సారి సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను" అంటూ రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం అంతటితో సద్దుమణిగిపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పబ్లిసిటీ కోసం నన్ను వాడుకుంటారా? : నగ్మా మండిపాటు

ఐటం గర్ల్ రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా నటించిన చిత్రం "జూలీ 2". ఈ చిత్రం శుక్రవారం ...

news

నగ్మా - శరత్ కుమార్ రొమాన్స్... రాయ్ లక్ష్మీ "జూలీ 2" కథ?

టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం "జూలీ 2". ...

news

ఎలాంటి కట్స్ లేకుండా పద్మావతి రిలీజ్.. ఎక్కడ?

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ...

news

నాగచైతన్య పుట్టినరోజు.. సవ్యసాచి ఫస్ట్ లుక్..

కొత్త పెళ్లికొడుకు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని సవ్యసాచి ఫస్ట్ లుక్ ...

Widgets Magazine