శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (14:36 IST)

సానియాను ఎంతో మిస్ అవుతున్నా.. షోయబ్ మాలిక్ ట్వీట్

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం (15 నవంబర్) 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సానియా పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభ

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం (15 నవంబర్) 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సానియా పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అందమైన తన భార్యకు మ్యాజికల్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశాడు. సానియాను ఎంతో మిస్ అవుతున్నానని చెప్పాడుయ ఈ సందర్భంగా ఇద్దరూ కలసి దిగిన ఓ ఫొటోను కూడా అప్ లోడ్ చేశాడు. 
 
పుట్టినరోజున ఆమె పక్కన లేకపోవడంపై చింతిస్తున్నానని షోయబ్ మాలిక్ చెప్పారు. మరోవైపు, పుట్టిన రోజు సందర్భంగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు క్రీడాకారులు, బాలీవుడ్ స్టార్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. షోయబ్‌, రైనాలతో పాటు ఫరాఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సానియాకు శుభాకాంక్షలు చెప్పారు.