శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (17:40 IST)

న‌వ్వుల‌తో ప్రారంభ‌మైన‌`ఎఫ్3' షూటింగ్‌

F3 team shooting
విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న సినిమా `ఎఫ్3`. డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2 ’చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌కు ఫ్రాంచైజీగా వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో రీస్టార్ట్‌ అయ్యింది. 
 
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను కాస్త పరిస్థితులు కుదుటపడుటుండటంతో రీస్టార్ట్‌ చేశాం. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభమైంది.  సెట్స్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో షూటింగ్‌ చేస్తున్నాం. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, సునీల్‌ సహా మెయిన్‌ కాస్ట్‌ అండ్‌ క్రూపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి..ఎఫ్3 చిత్రాన్నితనదైన స్టైల్లో ఎఫ్‌2కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్నారు. మా బ్యాన‌ర్‌లో మ‌రో న‌వ్వుల రైడ్ క‌న్‌ఫ‌ర్మ్‌’’ అన్నారు. 
 
అనీల్ రావిపూడి మాట్లాడుతూ, ఎఫ్ 2కు ఫ్రాంచైజీగా మోర్ ఫ‌న్‌తో ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మా సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌గారు.. నిర్మాత‌లు రాజుగారు, శిరీష‌న్న స‌పోర్ట్‌తో వీలైనంత త్వరంగా సినిమాను పూర్తి చేస్తాం"  అన్నారు. 
 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి, స‌హ నిర్మాత‌: హ‌ర్షిత్ రెడ్డి, సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌,  సినిమాటోగ్ర‌ఫీ:  సాయి శ్రీరామ్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటింగ్‌:  త‌మ్మిరాజు, ర‌చ‌నా స‌హ‌కారం: ఎస్‌.కృష్ణ‌, ఆడిష‌న్ స్క్రీన్‌ప్లే:  ఆది నారాయ‌ణ‌, నారా ప్ర‌వీణ్‌