Widgets Magazine

సెల్ఫీ కోసమంటూ పక్కకొచ్చి.. నడుము తాకాడు.. నుష్రత్ భరూచా

గురువారం, 14 జూన్ 2018 (11:01 IST)

దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు, వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అన్నీ రంగాల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఇక సినీ రంగానికి చెందిన తారలకు క్యాస్టింగ్ కౌచ్‌ పేరిట ఇబ్బందులు.. పబ్లిక్‌లోనూ వేధింపులు తప్పట్లేదు. తాజాగా సెల్ఫీ కోసమంటూ హీరోయిన్‌ పక్కన నిలబడిన ఓ అభిమాని.. మెల్లగా ఆమె నడుమును తాకాడు. ఈ చేదు అనుభవం హీరోయిన్ నుష్రత్ భరూచాకు జరిగింది. 
 
దీనిపై నుష్రత్ స్పందిస్తూ.. సెల్ఫీ దిగుతానంటూ వచ్చిన ఓ అభిమాని కోరికను కాదనలేక.. అతని పక్కన నిలబడ్డానని.. అయితే అతను చేసిన పనికి షాక్ అయ్యానని నుష్రత్ వాపోయింది. తెలుగులో శివాజీ సరసన ''తాజ్ మహల్'' సినిమాలో నటించిన ఈ భామ, పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వేళ, ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. 
 
ఫోటో దిగుతున్న సమయంలో అతను మరింత దగ్గరగా వచ్చి, తన నడుమును తాకాడని.. తాను దిగ్భ్రాంతికి గురవగా.. ఈలోగా ఈవెంట్ టీం సభ్యుడొకరు వచ్చి, సదరు యువకుడిని మందలించి, దూరం జరగాలని హెచ్చరించాడని చెప్పింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టెన్ష‌న్‌లో రాజ్ త‌రుణ్‌.. స‌క్స‌స్ కోసం ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్... ఇలా తొలి మూడు చిత్రాల‌తో స‌క్స‌స్ ...

news

షకీలాకు 'శీలవతి' అని సినిమా పేరు పెట్టుకునేందుకు అర్హత లేదా?(Video)

షకీలా నటిస్తున్న 250 సినిమా శీలవతి.. అయితే షకీలా సినిమాకు శీలవతి అను పేరు పెట్టడాన్ని ...

news

విజయ్ సేతుపతి ''జుంగా'' ట్రైలర్.. ఇలా వుంది.. మీరే చూడండి (వీడియో)

మెగాస్టార్ ''సైరా''లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న కోలీవుడ్ హీరో, మక్కల్ సెల్వన్ ...

news

ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రానికి మాటల ...

Widgets Magazine