గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (08:59 IST)

నా హీరోల్లో సరుకున్న ముఖం వరుణ్ తేజ్.. తనలో చిరంజీవి కళ్లు.. పవర్ స్టార్ చమక్‌లు: అన్నదెవరు?

ఈ శుక్రవారం విడుదల కానున్న శేఖర్ కమ్ముల చిత్రం ఫిదా మూడేళ్ల తర్వాత తాను తీసిన సినిమా. దీనికి దిల్ రాజు నిర్మాత కావడంతో ఒక రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు సినిమాలో పల్లెటూరు అంటే గోదావరి, కోనసీమను చూపటం అలవాటైన చరిత్రకు భిన్నంగా తెలంగాణ పల్లెటూరు

ఈ శుక్రవారం విడుదల కానున్న శేఖర్ కమ్ముల చిత్రం ఫిదా మూడేళ్ల తర్వాత తాను తీసిన సినిమా. దీనికి దిల్ రాజు నిర్మాత కావడంతో ఒక రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు సినిమాలో పల్లెటూరు అంటే గోదావరి, కోనసీమను చూపటం అలవాటైన చరిత్రకు భిన్నంగా తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో తీసిన ఫిదా సినిమా చూస్తే తెలంగాణ ఇంత పచ్చగా, అందంగా ఉంటుందా అనిపిస్తుందంటున్నారు శేఖర్ కమ్ముల. జూలై 21న ఫిదా విడుదల అవుతున్న సందర్భంగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శేఖర్ కమ్ముల తన తాజా చిత్రంలో హీరో హీరోయిన్లను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఏదో పొగడాలని కాకుండా వారి నటనకు ముగ్ధుడయ్యే వారిరువురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు శేఖర్. అదేదో తన మాటల్లోనే విందాం. 
 
సిన్మాలో వరుణ్‌ది ఓ యాటిట్యూడ్‌ అయితే సాయి పల్లవిది ఇంకో యాటిట్యూడ్‌. పల్లవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా నటించగలదనే ఫీల్‌ ఇచ్చింది. ఆమెకు ధీటుగా వరుణ్‌ నటించాడు. నేను చేసిన హీరోల్లో అతనిది చాలా ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌. కళ్లు చూస్తే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌గార్ల చమక్‌లు కనిపిస్తాయి.
 
ప్రతి ఒక్కరు ఈ సినిమాను రెండు మూడుసార్లు చూస్తారు. దుమ్ము దులుపుతుందంతే. దుమ్ము దులపడమంటే... బ్లాక్‌బస్టర్‌ అని కాదు, ఇట్స్‌ రీ–ఫ్రెషింగ్‌ ఫిల్మ్‌. యంగ్‌స్టర్స్, ఫ్యామిలీలకు బాగా నచ్చుతుంది. అమ్మాయిలు గర్వపడే చిత్రమిది. నేను ఎంచుకున్న నేపథ్యం, కథకు న్యాయం చేయడం నా స్టైల్‌. ‘ఫిదా’ నా స్టైల్‌లో అందంగా, కవితాత్మకంగా... వర్షం పడుతున్నట్టు ఉంటుంది.
 
మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా... ప్రేక్షకుల అభిరుచులు మారాయా వేరే ట్రెండ్‌ వచ్చిందా అనే భయాలు నాలోనూ ఉన్నాయి. అయితే, ఇలాంటి సిన్మా ప్రేక్షకులు చూసుండరు. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ మూడు కంటే గొప్ప కథలు రాయలేరు. ఆ తర్వాత తవ్వుకుంటుంటాం. ప్రేమకథలైతే మరీ ఎక్కువ రాయలేం. ఫీలయ్యి రాయాలి కాబట్టి! ఒక్కసారే మేజిక్‌ జరుగుతుంది. ఈ సిన్మాకు అది జరిగింది. నా ఆశ ఏంటంటే... స్టార్స్‌ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. వాళ్లకూ మాస్‌ కమర్షియల్‌ సినిమాలు చేసి బోర్‌ కొడుతుంది.
 
కథ రాస్తున్న టైమ్‌లో అమ్మాయి నేపథ్యం తెలంగాణ ఏరియాకి చెందిన పల్లెటూరు అయితే బాగుంటుందనుకున్నా. సాధారణంగా పల్లెటూరు అంటే మనకు కోనసీమే చూపిస్తారు. తెలంగాణలో భాన్సువాడను చూపించడం మంచి నిర్ణయం. ‘ఆనంద్‌’ కథేంటి అనడిగితే నేను చెప్పలేను. అలాగే, ఈ కథ కూడా! ఫీల్‌ ఉన్న చిత్రమిది. సినిమా చూస్తే తెలంగాణ ఇంత పచ్చగా, అందంగా ఉంటుందా అనిపిస్తుంది. 
 
‘‘శేఖర్‌ కమ్ముల సినిమా కావాలనే ‘దిల్‌’ రాజుగారు గానీ, ఎవరైనా నా దగ్గరకొస్తారు. ఎందుకంటే... నేను వేరేలా చేయలేను. ఇందులో ఏమైనా ట్వీక్‌ (సర్దుబాట్లు) చేస్తే మొదటికే దెబ్బ పడుతుంది. అది ఆయనకు (‘దిల్‌’ రాజు) తెలుసు. ఎవరో కాదు, నేనే ఒకసారి రాసిన సీన్‌ను లేపితే మళ్లీ రాయలేను. ఇదేదో గొప్పగా చెప్పడం లేదు. నేనంతే! నీ స్టైల్‌లో సినిమా తీయమని ‘దిల్‌’ రాజు చెప్పారు’’ అన్నారు శేఖర్‌ కమ్ముల.