Widgets Magazine

రూ.200 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా : హీరో రాజశేఖర్

ఆదివారం, 29 అక్టోబరు 2017 (14:35 IST)

తనకు అనుకూలంగాలేని సమయంలో అనేక చిత్రాలు చేశానని, ఆ కారణంగా రూ.200 కోట్ల మేరకు ఆస్తులు అమ్ముకున్నట్టు హీరో రాజశేఖర్ ఆవేదనతో వెల్లడించారు. హీరో రాజశేఖర్ తాజా నటిస్తున్న చిత్రం ''గరుడవేగ''. ఈ సినిమా వచ్చే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఇటివల చినిపోయిన ఆయన తల్లిని తలుచుకుని ఎమోషన్ ఫీలయ్యారు.
 
చిత్ర ట్రైలర్‌కి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసిన తన తల్లి ఎంతో సంతోషించారని కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదన్నారు. కారణం.. ఆ మరుసటి రోజు తన తల్లి చనిపోయిందని రాజశేఖర్ కన్నీటి పర్యంతమయ్యారని తెలిపారు. సుమారు రూ.200 కోట్ల ఆస్తులను అమ్ముకున్నాని దాంతో అమ్మ చాలా బాధపడ్డారని రాజశేఖర్ ఆవేదనగా చెప్పారు. 
 
సినిమాల్లో చాలా మంది ఇలా నష్టపోయి చివరి దశలో ఏమీ లేకుండా చేసుకుంటారని అలాగే నేను అవుతానేమోనని అమ్మ చాలా బాదపడేది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆ సమయంలో విలన్ పాత్రలు చేయడానికి సిద్ధపడ్డాను కానీ పాత్రలు నచ్చలేదని తెలిపారు. ''ఢిల్లీ రాజైన తల్లికి కొడుకే'' అన్న విధంగా రాజశేఖర్ తన తల్లిని తలుచుకుని కన్నీరు కార్చడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

రాజకీయాల్లో రావాలంటే ఆ రెండు చాలవు.. అంతకంటే ఎక్కువే కావాలి : రజనీ

రాజకీయాల్లోకి రావాలంటే ఆ రెండూ చాలవనీ అంతకంటే ఎక్కువే కావాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ ...

news

సుస్వర ప్రస్థానానికి ముగింపు పలికిన గాయని

గానకోకిలమ్మ ఎస్. జానకి ఇక పాడరు. మైసూరులో చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. తన సుస్వర ...

news

25 యేళ్ళ తరువాత రాములమ్మకి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్...

ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి జంట అంటే మాస్‌కే కాదు క్లాస్‌కు కూడా పిచ్చ క్రేజ్. ఎన్నో ...

news

తెలుగు టాప్ హీరోల వయసులెంతో తెలుసుకోవాలనుందా...?

తెలుగు సినీపరిశ్రమలో కొంతమంది పాతతరం హీరోలు యంగ్‌గా కనిపిస్తుంటారు. మేకప్‌తో వారి ...