సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (17:04 IST)

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే'...

'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహ

'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది.
 
పూర్తి కటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్‌గా రూపొందుతుందని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇటీవ‌లే తొలి ఓసాంగ్‌ను రిలీజ్ చేశారు. 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట సంగీత ప్రియులకి ఎంత‌గానో న‌చ్చింది. ఈ పాట ఇపుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కేవలం వారం రోజుల‌లోనే 10 మిలియ‌న్స్‌కిపైగా వ్యూస్ రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా తెలిపింది.