బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:54 IST)

యాక్షన్ ఎంటర్ టైనర్ గా జెమ్- 17న థియేటర్ లలో

Jem movie pressmeet
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా `జెమ్`. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నఈ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జెమ్ మూవీని అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించేందుకు సహకరించిన నిర్మాత పత్తికొండ కుమారస్వామి గారికి థాంక్స్. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాం. మీ అందరికీ నచ్చుతుంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విజయ్ రాజా యాక్టింగ్ హైలైట్ గా నిలుస్తుంది. నక్షత్ర, రాశీ సింగ్ ఇద్దరూ బాగా నటించారు. జెమ్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ, ఇవాళ ఒక సినిమాను విడుదల దాకా తీసుకురావడం గొప్ప విషయం. జెమ్ లో విజయ్ రాజా యాక్టింగ్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. నా బెస్ట్ వర్క్ ఇచ్చేందుకు ప్రయత్నించాను. నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. మీరూ హ్యాపీగా ఫీలవుతారని ఆశిస్తున్నానని అన్నారు.
 
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ, జెమ్ సినిమాను బ్యాక్ బోన్ టెక్నీషియన్స్ అని చెప్పాలి. అలాగే అజయ్, సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి లాంటి ఆర్టిస్టులు మా చిత్రంలో నటించి, ఆకర్షణగా నిలిచారు. వాళ్లందరికీ థాంక్స్. ఎప్పుడెప్పుడు మా సినిమా థియేటర్ లకు వస్తుందా అని ఎదురుచూశాను. ఈనెల 17న విడుదలకు వస్తున్నాం. జెమ్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
 
హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ,  ఈ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. శశి, జెమ్ నా కెరీర్ లో ఒకేసారి ప్రారంభమైన చిత్రాలు. జెమ్ సినిమా షూటింగ్ టైమ్ ను ఎంజాయ్ చేశాను. విజయ్ బాగా ఫైట్స్, డాన్సులు చేశాడు. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ అన్నీ అంశాలు ఉన్న చిత్రమిది. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే సినిమా జెమ్ అవుతుంది. అని అన్నారు.