కార్తీక మాసం.. మృగశిర నక్షత్రం.. సీతమ్మను కలిసిన రోజు.. హనుమను పూజిస్తే..?
డిసెంబర్ 2, 2020.. కార్తీక బుధవారంతో పాటు విదియ తిథి, మృగశిర నక్షత్రం కూడా కలిసివచ్చే రోజు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక బుధవారం మృగశిర నక్షత్రం రోజున గృహప్రవేశానికి, వివాహాది శుభకార్యాలకు విశిష్ఠమైన రోజు. కార్తీక వ్రతం ఆచరించే వారు ఈ రోజున అశ్వినీ దేవతలను పూజించాలి. ఈ రోజున అశ్వినీ దేవతలను తృప్తి పరిచే విధంగా ఔషధాన్ని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇంకా ధనాన్ని దానం ఇచ్చినా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వ్రతమాచరించే వారు ఈ రోజున తరిగిన ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే ఉడికించిన ఆహారాన్నే తీసుకోవాలి. ఉడికించిన పప్పు, బంగాళాదుంప, ఉడికించిన గోంగూర తీసుకోవచ్చు. ఈ నక్షత్రం రోజున హనుమంతుడిని కొలిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి.
రామాయణంలో సీతాదేవిని హనుమంతుడు దర్శించుకున్న రోజు ఇదే కావున.. ఈరోజున హనుమాన్‌ను పూజించిన వారికి ఈతిబాధలు, సమస్త దోషాలు, సమస్త దుఃఖాలు తొలగిపోతాయని సీతాదేవి వరమిచ్చినట్లు చెప్తారు.
అందుకే ఈ రోజుల హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం లేదంటే ఇంటివద్దే హనుమంతుడి విగ్రహం ముందు తమలపాకులను వుంచి.. అరటి పండ్లను సమర్పిస్తే.. శుభఫలితాలు వుంటాయి. అప్పుల బాధలు తీరిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.