గోవా టు హైదరాబాద్! ప్రతి క్షణం ఆస్వాదించానుః నమ్రత
మహేష్ బాబు నటిస్తున్న సినిమా `సర్కారు వారి పాట`. పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో రూపొందుతోంది. తాజా షెడ్యూల్ ఇటీవల గోవాలో మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ 15రోజుల పాటు షూటింగ్ చేసిన చిత్రబృందం.. గోవా షెడ్యూల్‌ను పూర్తిచేసింది. అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో వస్తుండగా నమ్రత ఫొటోలు పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేసింది. గోవా టు హైదరాబాద్! ప్రతి బిట్‌ను ఆస్వాదించాను. మరోసారి వరకు. అంటూ పోస్ట్ చేసింది. అయితే అందులో మహేస్‌బాబుతోపాటు మంజుల, నమ్రత వున్నారు. వారితోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబం కూడా వుంది. మరి వీరెందుకు వున్నారనే ఆశ్చర్యం కలగక మానదు.
వంశీపైడి అంటే మహేష్‌కు గురి ఎక్కువ. కథల విషయంలో పాత్రల ఎంపిక విషయంలో సంప్రదిస్తుంటాడని టాక్. దానితోపాటు వంశీ కుమార్తె, మహేస్ కుమార్తె ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. మంచి ఆదరణ పొందింది కూడా. ఇప్పుడు ఈ గోవా టు హైదరాబాద్ టూర్ విషయాలను కూడా యూట్యూబ్‌లో పెట్టి వారి కుమార్తెలు అనుభవాలను పంచుకుంటున్నారు.
ఇక సినిమాపరంగా చూస్తే, బేంక్ నేపథ్యంలో కథ వుంటుందని ఇప్పటికే చెప్పేశారు. కీర్తిసురేశ్‌తోపాటు విద్యా బాలన్ కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో మహేశ్ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇక సెప్టెంబర్ మొదటివారంలో మరోసారి గోవా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది.