శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (10:49 IST)

బాలీవుడ్ సినిమాలో డార్లింగ్.. మూడేళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్

బాహుబలి హీరో ప్రభాస్‌కు యమా క్రేజ్ వుంది. బాహుబలికి ధీటుగా ప్రభాస్ ఇమేజ్‌ను తీసుకెళ్లేందుకు ఆయనతో సినిమా చేసే దర్శకులు కసరత్తులు చేస్తున్నారు. బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ ''సాహో''లో కనిపిస్తున్న స

బాహుబలి హీరో ప్రభాస్‌కు యమా క్రేజ్ వుంది. బాహుబలికి ధీటుగా ప్రభాస్ ఇమేజ్‌ను తీసుకెళ్లేందుకు ఆయనతో సినిమా చేసే దర్శకులు కసరత్తులు చేస్తున్నారు. బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ ''సాహో''లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ అంతకంటే ముందు ప్రభాస్ మరో సినిమాకు సంతకం చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అది కూడా బాలీవుడ్ సినిమా అని టాక్. అంతేగాకుండా మూడు సంవత్సరాల క్రితమే బాలీవుడ్‌లో నటించేందుకు తాను ఒప్పేసుకున్నానని తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించాడు. 
 
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో చాలామంది బాలీవుడ్ నటీనటులతో కలిసి ఆయన నటించనున్నాడు.

హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడని టాక్ వస్తోంది. ఈ సినిమా వివరాలు పూర్తిగా తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.