Widgets Magazine

''రంగస్థలం'' సక్సెస్ మీట్.. చీఫ్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్

గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:25 IST)

rangasthalam movie still

''రంగస్థలం'' సినిమా తాజాగా రూ.150కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రంగస్థలం నాలుగో స్థానంలో నిలిచింది. విడుదలైన 11 రోజుల్లోనే ఈ సినిమా  రూ.150 కోట్ల గ్రాసును సాధించడం విశేషం. ఓవర్సీస్‌లోను రంగస్థలం హవా కొనసాగుతోంది. నాన్నకు ప్రేమతో చేసిన సుకుమార్.. ఎన్టీఆర్‌కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. 
 
ఇక గ్రామీణ నేపథ్యంలో 'రంగస్థలం' సినిమా చేసి చరణ్‌కి కూడా అనూహ్యమైన విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు సుక్కు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీస్థాయిలో సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే రంగస్థలం సక్సెస్ మీట్ వేదిక ఎక్కడనేది ఆసక్తిగా మారింది. 
 
హైదరాబాద్-యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుకను జరపనున్నారనేది తాజా సమాచారం. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటం విశేషం.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"భరత్ అనే నేను"కు లైన్ క్లియ‌ర్.. ఎలా?

సూపర్‌స్టార్ మహేష్ బాబు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ...

news

ఆ ముదురు హీరోకు బ్యాడ్‌టైమ్... మూవీలన్నీ ఆగిపోతున్నాయ్..

విక్ట‌రీ వెంక‌టేష్ "గురు" సినిమా రిలీజ్ అవ్వ‌డం..విజ‌యం సాధించ‌డం జ‌రిగి చాలా రోజులైంది. ...

news

సెన్సార్ బోర్డుపై పీపుల్ స్టార్ ఫైర్... ఎందుకో తెలుసా?

పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం "అన్న‌దాత సుఖీభ‌వ"‌. ...

news

ఉత్తేజ్ డ్యాన్స్ స్కూల్ 'మ‌యూఖ‌' ( ఎరెనా ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్స్ట్) ప్రారంభం

ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ బుధ‌వారం హైద‌రాబాద్ ఎల్లారెడ్డి గూడ‌లో మ‌యూఖ( ఎరెనా ఆఫ్ ...