శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (09:39 IST)

బేబీ బంప్‌తో హరితేజ.. ఫోటోలు వైరల్..

Hari Teja
బిగ్ బాస్ సీజన్ 1 కంటిస్టెంట్ హరితేజ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగులో పలు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గానూ ప్రేక్షకులను అలరించారు హరితేజ. హౌజ్‌లో ఉన్నప్పుడు హరితేజ చెప్పిన హరికథ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. 2015లో దీపక్ రావుని వివాహమాడిన హరితేజ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.
 
జనవరిలో హరితేజ సీమంతం వేడుక జరిపించగా, ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు . ఇక ఈ వేడుకలో హరితేజ బేబీ బంప్‌తో డ్యాన్స్‌ చేసి అలరించారు. మరి కొద్ది రోజులలో చిన్నారికి జన్మనివ్వనున్న హరితేజ బేబి బంప్‌తో ఫొటో షూట్ చేసి అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.