గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (19:03 IST)

ఆర్య-సాయేషాల ముద్దుల కూతురు.. కిక్ శ్యామ్ ఇంట సందడి

Sayesha
Sayesha
నటుడు ఆర్య, హీరోయిన్ సాయేషాను 2019లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయేషా 'అఖిల్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం ప్లాప్ కావడంతో తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. 
 
అయితే కోలీవుడ్‌లో బాగా రాణించింది. 'గజినీకాంత్' చిత్రం టైంలో ఆర్య, సాయేషాల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య 18 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. 
 
ఆమె పేరు ఆర్యానా. ఆర్య దంపతులకు పాప పుట్టిన విషయాన్ని హీరో విశాల్ బయటపెట్టాడు. ఈ జూలై 24కి వీరి పాపకి మొదటి సంవత్సరం పూర్తయింది. అయితే పాప ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. 
 
కానీ 'కిక్' శ్యామ్ పుట్టినరోజు వేడుకల్లో ఈ దంపతులు తమ పాపతో కలిసి సందడి చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.