బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:54 IST)

నెల్సన్ దిలీప్ కుమార్‌పై ఎస్ఏసీ మండిపాటు

sa chadrasekhar
విజయ్ హీరోగా వచ్చిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ నిర్మించింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ, కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌పై విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ మండిపడ్డారు. దర్శకుడు మరింత శ్రద్ద వహించి తీసివుంటే బాగుండేదన్నారు. 
 
ఇపుడు బీస్ట్ చిత్రం కేవలం తన కుమారుడు స్టార్‌డమ్ వల్లే ఆడుతోందని చెప్పారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వల్ల చిత్రానికి పేరు రాలేదన్నారు. విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ వల్లే ఈ చిత్రానికి ఇంకా కలెక్షన్లు వస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
"బీస్ట్ చిత్రాన్ని తాను ఇటీవలే చూశాను. సినిమా హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అది తన కుమారుడికి ఉన్న పేరుతోనే వచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్ వంటి సీరియస్ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్నపుడు ఇంకాస్త్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లేతో ఓ మ్యాజిక్ చేయొచ్చన్నారు. కానీ బీస్‌ చిత్రంలో ఆ మ్యాజిక్ లేనే లేదని వ్యాఖ్యానించారు.