శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (14:36 IST)

మంచు విష్ణు రావణాసురుడైతే.. శ్రియ ఏం చేసిందో తెలుసా?

మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ

మంచు విష్ణు, శ్రియ అతిథి పాత్రల్లో నటిస్తున్న సినిమా గాయత్రి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండగా యాంకర్ అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ద‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలో మంచు విష్ణు రావణాసురినిగా పది తలలతో కనిపించాడు.
 
మంచు విష్ణు రావణాసురుడి అయితే తనకేంటి అన్న చందంగా శ్రియ విష్ణు తలను పట్టుకుని వున్నట్లు ఫోజిచ్చింది. ఈ ఫోటోలో వీరిద్దరూ కూడా డీ-గ్లామర్ లుక్‌లో సరదాగా కనిపిస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న ప‌తాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90టీస్ నేపథ్యంలో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.