శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 జనవరి 2022 (22:09 IST)

ఈ లుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? రష్మిక ప్రశ్న, మరి మీ సమాధానం?

ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
రష్మిక మందన్న. హీరోయిన్లలో చాలా స్పోర్టివ్ నేచర్ వున్న వారిలో ఈమె టాప్ పొజిషన్లో వుంటారని అంటుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన చిత్రాల గురించి అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది.

 
ఇక తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయారు. తన మెడలో బంగారు రంగులో అలంకరించబడిన షీర్ గౌనుతో కనిపించింది. క్యాప్షన్‌లో, ఆమె తన అభిమానులను దుస్తుల గురించి ఏమి అనుకుంటున్నారు అని అడిగారు, అందులో "ఈ లుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించింది.
 

రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి నటించిన తన మొదటి పాన్-ఇండియా చిత్రం 'పుష్ప' భారీ విజయంతో మేఘాల్లో విహరిస్తోంది. ఈ సంవత్సరం, ఆమె 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై' చిత్రాలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. ఈ చిత్రాలపై చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే రష్మిక తన లుక్‌ను ఇలా గ్లామరస్‌గా చూపించేస్తుంది.