శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (11:09 IST)

వామ్మో... ఆ బ్యాగు అంత ఖరీదా?

ఇటీవలి కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ వ్యక్తిగత దుస్తులు లేదా వస్తువులపై అధిక శ్రద్ధను కనపరుస్తున్నారు. ఈ వ‌స్తువుల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా ప్రియాంక చోప్రా తాను రూ.7 కోట్ల నెక్లెస్ ధ‌రించి హాట్ టాపిక్‌గా నిలిచింది. తాజాగా అలియా భ‌ట్ ముంబై విమానాశ్ర‌యంలో బ్లూ క‌ల‌ర్ బెల్ట్ బ్యాగ్ ధ‌రించి న‌డుచుకుంటూ వెళ్ళింది. 
 
అంద‌రి దృష్టి అలియా క‌న్నా ఆమె బ్యాగ్‌పైనే ప‌డింది. బ్యాగ్‌ ఖ‌రీదు ఎంత అని ఆరా తీస్తే దాని విలువ 1890 అమెరికన్‌ డాలర్స్ అని తెలిసింది. అంటే మ‌న క‌రెన్సీ ప్ర‌కారం 1,39,170 రూపాయ‌లు. కొన్నాళ్ళుగా త‌న న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న అలియా భ‌ట్ ఆ మ‌ధ్య ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ప్రేమ‌యాణం అంటూ వార్త‌ల‌లో నిలిచింది.
 
తాజాగా కాస్ట్‌లీ బ్యాగ్‌తో వార్త‌ల‌లోకి ఎక్కింది. 'కళంక్' అనే చిత్రంతో బిజీగా ఉన్న అలియా రీసెంట్‌గా సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా కొన్ని స్ట‌న్నింగ్ స్టిల్స్ పోస్ట్ చేసింది. ఇవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. 'స‌డ‌క్ 2'లోనూ అలియా భ‌ట్ ముఖ్య పాత్ర పోషించ‌నుంది. "బ్ర‌హ్మ‌స్త్రా" చిత్రంతో పాటు 'త‌క్త్' అనే చిత్రంలోనూ అలియా న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.