బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:11 IST)

నాన్న‌గారి బ‌యోపిక్ తీయాల‌నేవుందిః నాగార్జున‌

Nag-wild
వైల్డ్‌డాగ్ సినిమా విడుద‌ల అనంత‌రం థియేట‌ర్ల‌నుంచి వ‌చ్చిన స్పంద‌న సంద‌ర్భంగా స‌క్సెస్‌మీట్‌లో శ‌నివారం నాగార్జున మాట్లాడారు. ఈ సినిమాకు ప‌డ్డ కృషి ఫ‌లించింద‌న్నారు. అలాగే అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారి బ‌యోపిక్ గురించి చెబుతూ, నాకూ నాన్న‌గారి బ‌యోపిక్ చేయాల‌నుంది. కానీ కొంచెం భ‌యంగా వుంది. ఒక్కోసారి భ‌యంలోంచి మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయి. త‌ప్ప‌కుండా అన్నీ స‌మ‌కూరితే చేద్దామ‌ని వుంది అని తెలిపారు.
 
Chiru, nag
మెగాస్టార్ చికెన్ బాగా వండారు
అలాగే సినిమాకు ముందు చిరంజీవితో క‌లిసి చికెన్ తిన‌డంపై మాట్లాడారు, ఆరోజు సాయంత్రం అంద‌రూ ప్రివూ చూడ‌డానికి వెళ్ళారు. నేనే ఒక్క‌డినే వున్నా. చిరంజీవిగారు ఫోన్ చేశారు. ఏంచేస్తున్నావ్ అని అడిగారు. అంద‌‌రూ సినిమా చూడ్డానికి వెళ్ళిపోయారు. నేను ఒక్క‌డినే వున్నా. అని చెప్ప‌గానే వెంట‌నే ఆయ‌న‌.. ఇంటికి రా:. రాజ‌మండ్రి నుంచి చ‌క్క‌టి చికెన్‌ ఐటం వ‌చ్చింది. అన్నారు. అలా చిరు ఇంటికి వెళ్ళాను. ఆయ‌నే చ‌క్క‌గా వండి పెట్టారు. తింటూ షూటింగ్ ముచ్చ‌ట్ల‌, షూటింగ్‌లో ఒత్తిడిల‌ గురించి మాట్లాడుకున్నాం అని తెలిపారు.