బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:13 IST)

నిశ్చితార్థం తర్వాత బ్రేకప్.. ముళ్లబాట చివరికి అందమైన గమ్యస్థానానికి..?

Saba Qamar
బాలీవుడ్‌ నటి సబా కమర్ ప్రముఖ వ్యాపారవేత్త అజీమ్‌ఖాన్‌ను పెళ్లాడడం లేదంటూ సంచలన ప్రకటన చేసింది. ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం అయింది. అంతలోనే ఈ నిర్ణయం బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. 
 
వ్యక్తిగత కారణాల వల్లే నిశ్చితార్థం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నా..అజీమ్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడమే బ్రేకప్‌కు కారణమని తెలుస్తోంది. తాము పెళ్లి చేసుకోవడం లేదని పేర్కొంది. తాను ఇప్పటి వరకు అజీమ్‌ఖాన్‌ను కలవలేదని, ఫోన్ల ద్వారా మాత్రమే మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పలేదని పేర్కొంది.
 
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సబా చేసిన ప్రకటనకు అజీమ్‌ఖాన్ స్పందించాడు. ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించాడు. దేవుడు ఆమెకు అన్నివేళలా విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ముళ్లబాట చివరికి అందమైన గమ్యస్థానానికి చేర్చుతుందని, బ్రేకప్ పూర్తి బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు అజీమ్ పేర్కొన్నాడు.