సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (19:32 IST)

గుర్రపు స్వారీ ఇష్టం - త్వ‌ర‌లో సొంత‌ది సంపాదిస్తాః విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Horse Riding
విజయ్ దేవరకొండ లైగ‌ర్ సినిమా షూట్ కోసం యు.ఎస్‌. వెళ్ళారు. అక్క‌డ మైక్ టైస‌న్ కాంబినేష‌న్‌లో షూట్ జ‌రుగుతోంది. అనంత‌రం ఆయ‌నతో వున్న స్టిల్ కూడా పోస్ట్ చేశాడు. తాజాగా ఓ సాయంత్రం గుర్ర‌పు స్వారీ చేసి ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. సుందరమైన ప్రదేశంలో థ్రిల్లింగ్ గా గుర్రపు స్వారీని ఆస్వాదించా. త్వరలో తన స్వంత గుర్రాన్ని సంపాదించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు.
 
ఈ గుర్ర‌పు స్వారీలు అంటే హీరోలంద‌రికీ ఇష్ట‌మే. కానీ అందులో పాపుల‌ర్ అయింది రామ్‌చ‌ర‌ణ్‌.ఇప్పటికే రెండు గుర్రాలను పెంచుకుంటున్నాడు. అందులో ఒకదాని పేరు బాద్షా కాగా మరోదాని పేరు కాజల్. మరి విజయ్ దేవరకొండ తాను పెంచుకునే గుర్రానికి ఏం పేరు పెడతాడో చూడాలి. ఇటీవ‌లే ఓ సంద‌ర్భంలో అనుష్క అంటే ఇష్ట‌మ‌ని సోస‌ల్‌మీడియాలో వెల్ల‌డించారు. దాంతో నెటిజ‌ర్లు అనుష్క అని పెడ‌తాడేమోనంటూ స్పందిస్తున్నారు.