గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:31 IST)

'ఐ లవ్యూ స్వీట్ హార్ట్' అంటున్న టాలీవుడ్ 'మన్మథుడు'

'ఐ లవ్యూ స్వీట్ హార్ట్' అంటున్న టాలీవుడ్ 'మన్మథుడు'. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్‌గా పేరుగడించిన అక్కినేని నాగార్జున తన భార్య అమల అక్కినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సో

'ఐ లవ్యూ స్వీట్ హార్ట్' అంటున్న టాలీవుడ్ 'మన్మథుడు'. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్‌గా పేరుగడించిన అక్కినేని నాగార్జున తన భార్య అమల అక్కినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా శుభాభినందనలు తెలిపారు.
 
'ఐ లవ్యూ స్వీట్ హార్ట్' అంటూ తన మనసులోని ప్రేమను వెలిబుచ్చారు. అమలతో కలిసున్న రెండు ఫోటోలను అభిమానులతో పంచుకున్న నాగార్జున, హ్యాపీ బర్త్ డే, నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.


కాగా, 'శివ' వంటి సూపర్ హిట్ చిత్రంతో పాటు 'నిర్ణయం' వంటి చిత్రాల తర్వాత పెళ్లి చేసుకుని అన్యోన్య జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా హీరో అఖిల్ పుట్టిన విషయం తెల్సిందే.