రవితేజ జీన్స్ ప్యాంటు చిరుగుళ్లెందుకు పవన్.. వాటి మీద దృష్టి పెట్టు: వర్మ

ఆదివారం, 13 మే 2018 (11:53 IST)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ట్విట్టర్లో స్పందించాడు. తాను ఎప్పుడూ తల్లిపై ఒట్టేయలేదని.. ఇక పవన్ గురించి కానీ.. మెగా ఫ్యామిలీ గురించి కానీ నెగటివ్‌గా మాట్లాడనని వర్మ.. పవన్‌పై మళ్లీ నోరెత్తాడు. తాజాగా పవన్ కళ్యాణ్, రవితేజని ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. మాస్ మహా రాజా నటించిన నేలటిక్కెట్ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
పవన్ కళ్యాణ్, రవితేజ కలసి ఆడియో వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో పవన్, రవితేజ పక్కపక్కనే కూర్చున్నారు. రవితేజ ధరించిన రగ్గుడ్ జీన్స్ ప్యాంటు ఆసక్తికరంగా కనిపించడంతో పవన్ కళ్యాణ్ రవితేజ ప్యాంటులోని చిరుగుళ్లను పరిశీలించారు. ఈ విషయాన్ని కూడా వర్మ వివాదం చేసే ప్రయత్నం చేశాడు. రవితేజ జీన్స్ తొడలపై పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి రెండు రాష్ట్రాలపై పెడితే సస్యశ్యామలమవుతాయని వర్మ సెటైర్ వేయడం సంచలనంగా మారింది.
 
నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో జరిగిన సరదా సన్నివేశాన్ని కూడా వర్మ ఇలా తన వ్యాఖ్యలతో పవన్ అభిమానులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. కాని గతంలోలా పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ ట్వీట్స్‌ని ఏమాత్రం పట్టించుకోలేదు.దీనిపై మరింత చదవండి :  
రవితేజ జీన్స్ ప్యాంటు పవన్ కల్యాణ్ నేలటికెట్ Jeans Raviteja Nela Ticket Audio Function Pawan Kalyan Ram Gopal Varma

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరీ ఫీలైతే నేనేం చేయను.. పవన్‌ను తిట్టడానికి శ్రీరెడ్డి అడ్డమా?: వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పీకేను కదిలించాడు. అక్కినేని నాగార్జునతో ...

news

'మహానటి' మూవీ ప‌ట్ల ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న‌ బాలీవుడ్ హీరోయిన్ రేఖ!

సావిత్రి బయోపిక్‌గా రూపొందిన‌ 'మహానటి' సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ...

news

అమెరికాలో మహానటికి 6వ స్థానం... ఆ చిత్రాలను అధిగమిస్తుందా? (Video)

సావిత్రి జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమా రికార్డుస్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు ...

news

ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ మూవీకి జ‌క్క‌న్న పెట్టిన టైటిల్ ఇదేనా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి...యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో భారీ ...