గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (09:45 IST)

"పుష్ప" మూవీ ప్రత్యేక స్క్రీనింగ్... బెర్లిన్‌కు బయలుదేరిన 'ఐకాన్ స్టార్'

allu arjun
అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'పుష్ప' ఈ చిత్రంతో అల్లు అర్జున్‌కు ‌అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఆయన్ను ప్రతి ఒక్కరూ ఐకాన్ స్టార్ అంటూ పిలిస్తున్నారు. ఈ క్రమలో బెర్లిన్ వేదికగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు అల్లు అర్జున్ బెర్లిన్‌కు బయలుదేరి వెళ్లాడు. ఈ ఫెస్టివల్‌లో "పుష్ప : ది రైజ్" చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
 
కాగా, తన పర్యటనలో భాగంగా అంతర్జాతీయ దర్శకులు, చిత్ర నిర్మాతలు, మార్కెట్‌లో సినిమా హక్కుల కొనుగోలుదారులతో అల్లు అర్జున్ సంభాషించనున్నారు. పుష్ప మూవీ స్క్రీనింగ్‌లో భాగంగా, అంతర్జాతీయ సినిమా మీడియాతో కూడా ఆయన మాట్లాడుతారు. కాగా, 'పుష్ప' చిత్రం రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, యూకేతో పాటు అనేక దేశాల్లో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, "పుష్ప-2" చిత్రం వచ్చే ఆగస్టు 15వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం కోసం సినిమా లోకం అమిత ఆసక్తితో ఎదురు చూస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. "200 రోజుల్లో పుష్పరాజ్ పాలన ఆరంభం" అంటూ సినిమా విడుదల తేదీన ఇటీవలే ప్రకటించింది. కె.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్‌, సునీల్‌లు కీలక పాత్రలను పోషించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం.