ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:25 IST)

అసలు పుష్ప ఎక్కడ, ఆసక్తికరంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప- 2 గ్లిమ్ప్స్ (video)

pushpa
పాన్ ఇండియా సార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప". 'పుష్ప' సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప' సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. 
 
'పుష్ప రాజ్' అనే క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
 
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అప్పటివరకు తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన అల్లు అర్జున్ "పుష్ప" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువయ్యాడు. 

 
'పుష్ప' సినిమా ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే క్రికెటర్స్ రాజకీయ నాయకులు సినిమాల్లోని డైలాగులు తమదైన స్టైల్‌లో చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. "పుష్ప-2" చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క గ్లిమ్స్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేసింది చిత్రం బృందం. 
 
ఈ గ్లిమ్ప్స్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే "తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప" అని న్యూస్ వినిపిస్తుంది. ఆ తర్వాత "అసలు పుష్ప ఎక్కడ" అని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఆసక్తికరంగా కట్ చేశారు. ఈ గ్లిమ్ప్స్ పూర్తి వీడియోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే కానుకగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రియలైజ్ చేయనున్నారు.