బీజేపీ టికెట్ ఇస్తే.. హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీకి సై: కంగనా రనౌత్
రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ప్రజలు కోరుకుంటే గనుక.. బీజేపీ అవకాశం ఇస్తే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను బయటపెట్టింది.
అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కంగనా శనివారం ఆజ్ తక్ పంచాయత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ రాజకీయ ప్రవేశంపై స్పందించడం చర్చనీయాంశం అయ్యింది.
అంతేగాకుండా.. తనకు బీజేపీ టికెట్ ఇస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఇదే క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కంగనా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ.. మహాపురుష్ అంటూ కామెంట్లు చేశారు. అలాగే, మోదీకి రాహుల్ గాంధీ ప్రత్యర్థి కావడం విచారకరమని చెప్పుకొచ్చారు.