బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (18:40 IST)

యాస్ ఐలాండ్, అబుదాబి లో జరుగనున్న సినిమాటిక్ వైభవం ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024

IIFA Festival 2024
IIFA Festival 2024
సెప్టెంబర్  6 మరియు 7, 2024తేదీలలో అబుదాబిలోని యాస్ ఐలాండ్ యొక్క ఆకర్షణీయమైన నేపథ్యంలో దక్షిణ భారత సినిమా యొక్క వైభవోపేతమైన వేడుకలు  జరుగనున్నాయి. ఏప్రిల్ 15 , 2024 నుండి  టిక్కెట్‌లు అందుబాటులో వుండనున్నాయి !
 
 అబుదాబి, యాస్ ఐలాండ్,  2 ఏప్రిల్ 2024: దక్షిణ భారత సినిమా యొక్క అపారమైన ప్రతిభ, వైవిధ్యతను  ప్రదర్శించడానికి ఐఐఎఫ్ఏ ఉత్సవం, తన ప్రపంచ పర్యటనను ప్రారంభించబోతోంది, ఈ సెప్టెంబర్ 2024 నుండి అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో  ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. 
 
గౌరవనీయులైన షేక్ నహాయన్ మబారక్ అల్ నహ్యాన్ (టాలరెన్స్ & కోఎక్సిస్టేన్స్ మంత్రి) ప్రోత్సాహంతో, ఐఐఎఫ్ఏ ఉత్సవం, ఈ సంవత్సరం సెప్టెంబర్ 6వ మరియు 7వ తేదీలలో  జరగనుంది. అద్భుతమైన రెండు-రోజుల మహోత్సవం సందర్భంగా మహోన్నతమైన  దక్షిణ భారతీయ సినిమా పవర్‌హౌస్‌లను యాస్ ఐలాండ్, అబుదాబికి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.  
యాస్ ఐలాండ్ యొక్క అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఉత్సాహభరితమైన  వినోద సమర్పణల నేపథ్యానికి అనుగుణంగా సెట్ చేయబడిన ఐఐఎఫ్ఏ ఉత్సవం దాని అద్భుతమైన ప్రదర్శనలు, అవార్డులు మరియు సినిమాటిక్  అనుభవాలతో ప్రేక్షకులను అబ్బురపరిచేలా సిద్దమైనది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 ను అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మరియు అబుదాబిలో లీనమయ్యే గమ్యస్థానాలు మరియు అనుభవాలను సృష్టించిన ప్రముఖ సృష్టికర్త మిరల్ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు.
 
తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చలనచిత్ర పరిశ్రమలపై దృష్టి సారించి, దక్షిణ భారత సినిమా విజయాలు మరియు వైభవాలను వేడుక జరుపుకుంటూ, ఐఐఎఫ్ఏ ఉత్సవం నాలుగు ప్రధాన పరిశ్రమలను ఒకచోట చేర్చి, వారి గొప్ప ప్రతిభ, సృజనాత్మకత మరియు కథనాలను ప్రపంచ ప్రేక్షకుల ముందు  ప్రదర్శిస్తుంది. 
 
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ తారల నుండి అంతర్జాతీయ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఔత్సాహికుల వరకు అందరినీ  ఒక చోట చేర్చి , ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 అర్ధవంతమైన కనెక్షన్‌లు మరియు భాగస్వామ్యాలను పెంపొందించడం,  నెట్‌వర్కింగ్ కోసం  సహకారం మరియు ప్రపంచవ్యాప్తంగా వినోదం కు అందమైన ఆకృతి అందించిన ప్రముఖుల మధ్య వేడుకలను నిర్వహించటానికి లక్ష్యంగా పెట్టుకుంది.   
 
వ్యవస్థాపకుడు/దర్శకుడు ఆండ్రీ టిమ్మిన్స్ మాట్లాడుతూ  “ హిజ్  ఎక్సెలెన్సీ షేక్ నహాయన్ మబారక్ అల్ నహ్యాన్ ( టాలరెన్స్ & కోఎక్సిస్టేన్స్  మంత్రి) ప్రోత్సాహంతో ఐఐఎఫ్ఏ ఉత్సవం అబుదాబిలోని యాస్ ఐలాండ్ కు  తిరిగి రావడం ఆనందంగా ఉంది.
 
మా ప్రయాణం కొత్త ఉత్సాహంతో కొనసాగుతుంది, దక్షిణ భారత  సినిమా యొక్క అత్యుత్తమ వేడుకలను మహోన్నత వైభవంతో నిర్వహిస్తామనే వాగ్దానం చేస్తుంది. ఈ సెప్టెంబర్ 2024లో ఐఐఎఫ్ఏ ఉత్సవం వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమా రంగాల నుండి పరిశ్రమ ప్రముఖలను ఒకచోట చేర్చి, ఈ ఉత్సాహభరితమైన గ్లోబల్ వేదికపై మేము మరోసారి మ్యాజిక్‌ను సృష్టించనున్నాము , ఇది నిజంగా వేడుకలకు కారణం!
 
ఐఐఎఫ్ఏ ఉత్సవం దక్షిణ భారత సినిమాపై ప్రపంచ దృష్టిని ప్రకాశింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, వినోద ప్రపంచంలో వారి ఉనికిని మరియు ప్రభావాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇది నిస్సందేహంగా శాశ్వతమైన ముద్రను మిగిల్చే వేడుక, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మరియు దక్షిణ భారత సినిమా యొక్క ప్రాముఖ్యతను మరియు వినోద ప్రపంచానికి దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది.." అని అన్నారు 
 
మిరాల్‌-  గ్రూప్ కమ్యూనికేషన్స్ & డెస్టినేషన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తగ్రిద్ అల్ సయీద్ మాట్లాడుతూ  "దక్షిణ భారత సినిమా ప్రతిభ మరియు వైవిధ్యంతో కూడిన ఈ వేడుకను నిర్వహించడానికి యాస్ ఐలాండ్ అబుదాబి ముందుకు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. తమ కథలను చెప్పే మరియు మా అతిథులతో మరపురాని జ్ఞాపకాలను పంచుకునే  తారలను స్వాగతించడానికి మేము ఆసక్తిగా వేచి చూస్తున్నాము.  యాస్ ఐలాండ్  హోస్ట్‌గా ఎంపిక కావడం,  ప్రపంచవ్యాప్తంగా  గుర్తింపు పొందిన ప్రపంచ స్థాయి ఈవెంట్‌లను ఆకర్షించడంలో దాని విజయానికి నిదర్శనం, అదే సమయంలో వినోదం మరియు విశ్రాంతి కోసం అగ్రశ్రేణి అంతర్జాతీయ గమ్యస్థానంగా దాని స్థానాన్ని పెంచుకోవడం మరియు మిలియన్ల మంది అభిమానులు , సందర్శకులకు దాని అద్భుతమైన ఆఫరింగ్స్ అందించటం ద్వారా ఆకర్షణీయమైన వేదికగా నిలుస్తుంది " అని అన్నారు 
 
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండు రోజుల వేడుక,  ప్రేక్షకులకు గొప్ప సినిమా అనుభవాలను అందజేస్తుందని వాగ్దానం చేస్తుంది, మొదటి రోజు తమిళం మరియు మలయాళ సినిమా యొక్క శక్తివంతమైన ప్రపంచాలను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది, వారి ప్రత్యేక కథనాన్ని మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని హైలైట్ చేస్తుంది. రెండవ రోజు, తెలుగు మరియు కన్నడ సినిమాలపై దృష్టి కేంద్రీకరించబడుతుంది, ఈ డైనమిక్ పరిశ్రమల నుండి విభిన్నమైన చలనచిత్రాలు మరియు ప్రదర్శనలతో ప్రేక్షకులకు ఆనందానుభూతులను అందించనుంది.
 
ఈ పరిశ్రమల సహకారాన్ని గౌరవించడం ద్వారా, ఐఐఎఫ్ఏ ఉత్సవం వారి విజయాలను వేడుకగా జరుపుకోవడమే కాకుండా భారతీయ సినిమా యొక్క ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో ఈ పరిశ్రమల తోడ్పాటును వెల్లడించటం, అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశం యొక్క విభిన్న సాంస్కృతిక వారసత్వం మరియు సినిమా శ్రేష్ఠతను గుర్తించి , ప్రశంసించడంలో కృషి ని వెల్లడి చేస్తుంది.
 
దక్షిణ భారత సినిమా సాధించిన విజయాలను ప్రదర్శించడానికి మరియు దీనిలో భాగమైన  ప్రతి ఒక్కరి సహకారాన్ని గౌరవించడానికి ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం; దక్షిణాది నుండి విభిన్న కథలు మరియు ప్రతిభకు పెరుగుతున్న గుర్తింపు , ప్రజాదరణకు గర్వకారణం.
 
సినిమా మరియు చలనచిత్ర ఔత్సాహికులకు  ప్రత్యేక ధరల అవకాశాలతో  రెండు రోజుల వేడుక , ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 ను ఆస్వాదించవచ్చు .