శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (15:49 IST)

జ్వరంతో బాధపడుతుంటే.. మా ఆయన వంట చేశారు.. ఆయనే బెస్ట్: ఇలియానా

పోకిరి భామ ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం నడిపింది. ప్రస్తుతం సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తన భర్తే బెస్ట్ అంటోంది. ఎందుకో తెలుసా? కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నానని.. ఆ

పోకిరి భామ ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం నడిపింది. ప్రస్తుతం సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తన భర్తే బెస్ట్ అంటోంది. ఎందుకో తెలుసా? కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నానని.. ఆ సమయంలో ఆయన దగ్గరుండి మరీ చూసుకుంటూ వంటలు చేసి పెడుతున్నాడని చెప్పింది. ఆరోగ్యం బాగోలేనప్పుడు మా ఆయనే దగ్గరుండి తనను చూసుకుంటున్నారని... మా ఆయన బెస్ట్ అంటూ కితాబిచ్చింది. 
 
అంతేగాకుండా ఆండ్రూ వంటకు సంబంధించిన ఓ ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో ఇన్నాళ్లు ఇలియానాకు పెళ్లైందా లేదా అనే అనుమానానికి తెరపడింది. ఆండ్రూతో ఇలియానా సహజీవనం చేస్తోందని.. ఆయనను భర్తగా స్వీకరించిందని తేలిపోయింది. కాగా.. 2017లోనే ఇలియానాకు, ఆండ్రూకు రహస్యంగా వివాహం జరిగిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.