గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (17:39 IST)

బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఉంగరాలు మార్చుకున్న విష్ణు - గుత్తా

భారత టెన్నిస్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతోంది. ఇప్పటికే తమిళ హీరో విష్ణు విశాల్‌తో సహజీవనం చేస్తున్న ఈమె.. త్వరలోనే పెళ్లికుమార్తె కాబోతుంది. ఇందులోభాగంగా, వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నట్టు సమాచారం. గుత్తా జ్వాలా పుట్టిన రోజైన సెప్టెంబరు 7వ తేదీని సందర్భంగా తన ప్రియురాలికి హీరో ఉంగరాన్ని బహుకరించడమే కాకుండా వేలికి తొడిగారు. 
 
ఆ తర్వాత గుత్తా కూడా తన ప్రియుడికి ఉంగరం పెట్టింది. అంటే.. వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నట్టే. ఈ విషయాన్ని విష్ణు విశాల్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. గుత్తా జ్వాల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేసిన విష్ణు విశాల్.. తమ నిశ్చితార్థం గురించి కూడా వెల్లడించాడు. ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
 
'పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్వాల. జీవితానికి కొత్త ఆరంభం. ఆశావహ దృక్పథంతో ముందుకెళదాం. మనతో పాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. మా కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ కావాలి. మా కోసం అర్థరాత్రి సమయంలో ఉంగరం ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌ (జ్వాల మేనేజర్)కు ధన్యవాదాలు' అని విష్ణు విశాల్ ట్వీట్ చేశాడు. 'నూతన ఆరంభం' అంటూ జ్వాల కూడా ఆనందం వ్యక్తం చేసింది.