శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (17:03 IST)

చైత‌న్య - స‌మంత‌ల మ‌జిలీ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్..!

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌జిలీ. ఈ చిత్రానికి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌లో రెండో హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ న‌టిస్తోంది. ఈ సినిమాలో నాగ చైత‌న్య క్రికెట‌ర్‌గా న‌టిస్తున్నారు.

దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్‌తో వ‌స్తున్న ఈ చిత్రం వైజాగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ అండ్ సెకండ్ లుక్స్‌కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.
 
ప్ర‌స్తుతం ఈ చిత్రం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. నాగ చైత‌న్య పైన కీల‌క స‌న్నివేశాల‌ను, ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ నెలాఖ‌రుకు షూటింగ్ కంప్లీట్ అవుతుంద‌ట‌. ఫిబ్ర‌వ‌రి నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేయ‌నున్నారు. ఈ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పైన సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మ‌జిలీని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.