మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 25 జనవరి 2022 (18:02 IST)

అమీర్ ఖాన్ కూతురా మజాకా.. ఫిట్నెస్ ట్రైనర్‌తో అలా..?

సినీ పరిశ్రమలో స్టార్స్‌కు అఫైర్స్ ఉండడం మామూలే. కొంతమంది వివాహం చేసుకుంటే మరికొంతమంది సహజీవనం చేసి ఆ తరువాత విడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే పెళ్ళి చేసుకుంటారు కానీ కొన్నిరోజులకు ఒకరికి ఒకరు దూరమై పోతుంటారు.

 
ప్రస్తుతం బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వ్యవహారం పెద్ద చర్చకే దారితీస్తోంది. ఫిట్నెస్ ట్రైనర్ సుపుర్ శిఖరే ప్రేమలో పడిందంటూ బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. తను సన్నగా, స్లిమ్‌గా ఉన్నానంటూ అతడితో కలిసిన ఫోటోను షేర్ చేసింది. 

 
ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఐరాఖాన్ రెండవ కుమార్తె. పెద్ద హీరో కుమార్తె ఫిటెనెస్ ట్రైనర్ కు పడిపోయిందా..అది కూడా డేటింగ్ చేస్తోందా అంటూ తెగ సందేశాలను ట్రోల్ చేస్తున్నారట అభిమానులు. ఇది కాస్త అమీర్ ఖాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.