గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (14:29 IST)

గర్భందాల్చిన ప్రియాంకా... తల్లి ఏమన్నదో తెలుసా?

అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తల్లి అయినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవ‌ల న్యూయార్క్‌లో జ‌రిగిన ఓ ఫ్యాష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్రియాంక చోప్రా వెరైటీ డ్రెస్‌లో మెరిసింది. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఆ ఫోటోలో ప్రియాంక లావుగా క‌నిపించడంతో పాటు గ‌ర్భం దాల్చిన‌ట్టుగా ఉంద‌ని ప‌లు మీడియా పత్రిక‌లు క‌థ‌నాలు ప్ర‌చురించాయి. 
 
దీనిపై ప్రియాంక త‌ల్లి మ‌ధు చోప్రా క్లారిటీ ఇచ్చింది. కెమెరా యాంగిల్ వ‌ల‌న ఆమె లావుగా ఉండ‌టంతో పాటు గ‌ర్భం దాల్చిన‌ట్టు క‌నిపించిందే త‌ప్ప‌, ఆమె త‌ల్లి కాబోతుంద‌నే వార్త అవాస్త‌వమంటూ మ‌ధు చోప్రా మీడియాకు తెలిపింది. 'ప్రియాంక గ‌ర్భిణి అనే వార్త‌ల‌ని చూసి నేను షాక్ అయ్యాను. వెంట‌నే ప్రియాంక‌కి కాల్ చేసి ఏంట‌మ్మా ఇది అని అడిగాను. ఆ స‌మ‌యంలో తాను అల‌సిపోయి ఉండ‌డంతో 'అమ్మా నాకు విరామం కావాలి' అని తెలిపిన‌ట్టు మ‌ధుచోప్రా స్ప‌ష్టం చేసింది. 
 
కానీ, మీడియా ప్రతినిధులు వాస్తవమేంటో తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారనీ, అలా చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రియాంక న‌టించిన హాలీవుడ్ చిత్రం 'ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌' త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా,ఈ సినిమా ప్రమోషన్స్‌ పనుల్లో బిజీగా ఉంది.