శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (15:02 IST)

వెంకీ కొత్త సినిమా స్టోరీ ఇదేనా..?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ సరసన ప్రియమణి నటిస్తుంది. కరోనా లేకపోతే నారప్ప సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. ఈ సినిమా తర్వాత వెంకీ చేయనున్న సినిమా ఎఫ్ 3. ఈ చిత్రానికి సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
 
 ఇక ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న వెంకీ - తరుణ్ భాస్కర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే... ఇది రెగ్యులర్ మూవీ కాదు. విభిన్న కథతో రూపొందే సినిమా అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. కథ ఏంటి అనేది బయటకు రాలేదు.
 
తాజాగా.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... గుర్రపు పందేలు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
 
 అయితే... లెక్చరర్ అయిన హీరో గుర్రపు పందేలపై ఆసక్తితో ఏం చేశాడు అనేది సినిమా కథాంశం అని తెలిసింది. వెంకీ ఇమేజ్‌కు తగ్గట్లుగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తరుణ్ భాస్కర్ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2021 ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వచ్చే ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.