గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (10:17 IST)

''అజ్ఞాత‌వాసి''లో పవన్- వెంకటేష్ స్టిల్స్ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ''అజ్ఞాతవాసి'' సినిమా వెంకీ రోల్ గురించి పెద్ద టాక్ వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథిపాత్ర పోషించారు. కానీ విడుదలైన ''అజ్ఞాతవాసి''లో వెంకటేష్ నటి

''అజ్ఞాత‌వాసి'' సినిమా క‌లెక్ష‌న్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అమెరికాలో హాలీవుడ్ దిగ్గ‌జాల‌తో పోటీప‌డి టాప్ ప్లేస్‌లో అజ్ఞాతవాసి ఉంద‌ని కొనియాడారు. తొలిరోజు ఏకంగా 1.5 మిలియ‌న్ డాల‌ర్లు, కేవ‌లం ప్రీమియ‌ర్ల ద్వారానే 9.65 కోట్లు కొల్ల‌గొట్టిందని.. వీకెండ్ కాకుండా వర్కింగ్ డేలోనే ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం అద్భుతమని తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యానించారు. ''అజ్ఞాత‌వాసి'' యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ ప్లేస్ ద‌క్కించుకుందని త‌ర‌ణ్ ట్వీట్ చేశారు. 
 
కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ''అజ్ఞాతవాసి'' సినిమా వెంకీ రోల్ గురించి పెద్ద టాక్ వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథిపాత్ర పోషించారు. కానీ విడుదలైన ''అజ్ఞాతవాసి''లో వెంకటేష్ నటించిన సీన్స్‌ను ఇంకా కలపలేదు. త్వరలో వెంక‌టేశ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య తీసిన సీన్ల‌ను ఈ సినిమాలో క‌ల‌ప‌నున్నారు. ఈ నేపథ్యంలో పవన్ - వెంకటేష్‌కు సంబంధించిన మూడు స్టిల్స్ ను "అజ్ఞాతవాసి'' చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.