హిందీ టీవీ అదితి గుప్తాకు కరోనా.. హోమ్ క్వారంటైన్‌లో..

Corona
corona
సెల్వి| Last Updated: బుధవారం, 1 జులై 2020 (14:18 IST)
హిందీ టీవీ అదితి గుప్తా కరోనా బారిన పడ్డారు. పలు టెలివిజన్ సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అదితి స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న పాపులర్ షో ఇష్క్ బాజ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

కరోనా సోకిందని తెలియగానే హోం క్వారంటైన్ లోకి వెళ్లానని భర్త, కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతున్నారని తెలిపారు. తగిన ఔషధాలు తీసుకుంటూ పాజిటివ్ ధోరణితో ఉంటున్నానని, తర్వలోనే కోలుకుంటానని చెప్పారు.

కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ను జులై 31 వరకు పొడిగించింది. సోమవారం (జూన్ 29) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఆది నుంచి కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలో తొలి స్థానంలో ఉంది.

దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ముంబై నగరం రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది.దీనిపై మరింత చదవండి :