సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (10:20 IST)

హీరో జగపతి బాబు తల్లి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా?

Jagapathi Babu Mother
Jagapathi Babu Mother
టాలీవుడ్‌లో జగపతి బాబుకు (Jagapathi Babu) ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఒకప్పుడు స్టార్‌ హీరోగా కుటుంబ కథా చిత్రాలతో అలరించాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రతినాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక తనకు నచ్చిన విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంటాడు. 
 
తాజాగా ఆయన పెట్టిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 
వాళ్ల అమ్మ నివసిస్తున్న ఇంటి వీడియోను పెట్టిన జగపతి బాబు.. ఆమెకు సింపుల్‌గా ఉండడం ఇష్టమని చెప్పారు. 
 
‘‘ఈ చోటు చూసి ఏదో అడవిలా ఉంది అనుకోకండి. ఇది హైదరాబాద్‌ సిటీలోనే ఉంది. మా అమ్మ ఇక్కడే ఉంటోంది. తనకు ఇలా సింపుల్‌గా ఉండడం ఇష్టం. ఒక యోగిలాగా ఉండడం మా అమ్మకు నచ్చుతుంది. పానకం తాగాలనిపించి మా అమ్మ దగ్గరకు వచ్చాను. చాలా రోజుల తర్వాత ఆమె చేతి వంట తినబోతున్నా’’ అంటూ వాళ్ల అమ్మ ఉంటున్న ఇంటి వీడియోను పెట్టారు.
 
ప్రస్తుతం జగపతిబాబు చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. గోపిచంద్‌తో కలిసి రామబాణం (Rama Banam)లో నటిస్తున్నారు. 
 
శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘సలార్‌’ (Salaar) సినిమాలోనూ జగపతి బాబు నటిస్తున్నారు. వీటితో పాటు మహేశ్‌, త్రివిక్రమ్‌ల (SSMB28) సినిమాలోనూ ఆయన కనిపించనున్నారు.