Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా' : టీజర్‌పై ఎన్టీఆర్ ఏమన్నారు

శనివారం, 8 జులై 2017 (10:37 IST)

Widgets Magazine

"ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా'' అంటూ 'జై లవకుశ' చిత్ర టీజర్‌‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోళ్ళలో నానుతోంది. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎన్టీఆర్ డైలాగ్ డెలవరీ టీజర్‌ని ఓ రేంజ్‌లో నిలబెట్టేసింది. దీంతో అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా టీజర్‌తో పాటు చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తారు.
jr ntr
 
ముఖ్యంగా ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌పై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పొగడ్తలు కురిపించారు. కాజ‌ల్, స‌మంత‌, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, నితిన్, రాజమౌళి, రానా, రాఘవేంద్రరావు ఇలా ఒక్కరేంటి ఎందరో సెలబ్రిటీలు జై టీజర్‌ని ఆకాశానికి ఎత్తేశారు.
 
ఈ స్పందనపై ఆ చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. టీజర్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు, స్నేహితులు, ఫిల్మ్ ఫ్రేటెర్నిటీ మరియు మీడియా ప్రతి ఒక్కరు జై టీజర్‌పై ప్రేమని చూపించడమే కాక అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞుడుని. ఇంక బెటర్‌గా చేసేందుకు ప్రయత్నిస్తా.. లవ్ యూ ఆల్ అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 
 
‘జై ల‌వకుశ’ చిత్రం టీజర్‌పై న‌టుడు, నిర్మాత క‌ల్యాణ్ రామ్ స్పందించారు. ఓ పోస్టర్‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ సినిమాలోని జై పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ వ‌దిలిన‌ టీజ‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న త‌న‌కు ఎంతో సంతృప్తినిచ్చింద‌ని అన్నాడు. ఇంత‌గా ఆద‌ర‌ణ క‌న‌బ‌రుస్తోన్న అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. మున్ముందు ఇలాంటివి త‌మ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి మ‌రిన్ని వ‌స్తాయ‌ని అన్నాడు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మా అమ్మ.. నాన్న పెళ్లికి ముందే పుట్టాను.. తప్పేంటంటున్న టాప్ హీరోయిన్.. ఎవరు?

టాలీవుడ్‌లో ఐరెన్‌ లెగ్‌గా ముద్రవేయించుకుని ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎగిన భామ శృతిహాసన్. ...

news

నిన్న 'ఈగ'.. నేడు 'చేప'..? స్వీయ నిర్మాణంలో హీరో నాని సరికొత్త ప్రయోగం

టాలీవుడ్ యువ హీరో నాని విభిన్నపాత్రలు పోషించేందుకు ఎపుడూ ముందుంటారు. గతంలో దర్శకధీరుడు ...

news

కెప్టెన్ కావాలనుకున్నా.. హీరోయిన్ అయిపోయిన అక్షర

విలక్షణ తమిళ నటుడు కమల్ హసన్ రెండో కుమార్తె అక్షర హసన కూడా తండ్రిబాటలో నడుస్తున్నారు. తన ...

news

హరీష్ నోటి దూలతో బన్నీకి దెబ్బేస్తున్నాడా...?

దువ్వాడ జగన్నాథం చిత్రం ఆది నుంచి విమర్శల్లో కూరుకుంది. తమను కించపరిచే మాటలు ...

Widgets Magazine