జాన్వీ కపూర్ సోదరిని రేప్ చేస్తారట..
కాఫీ విత్ కరణ్ షోలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ గురించి కూడా జాన్వీ నోరు విప్పింది. ఇదే కార్యక్రమంలో జాన్వీ ఓ టాస్క్‌లో భాగంగా తన సోదరి అన్షులాకీ (బోనీకపూర్ తొలి భార్య కుమార్తె) కాల్ చేసి ఒక విషయం గురించి అడగగా దాన్ని జాన్వీ సరదాగా తిరస్కరించింది. దీంతో నెటిజన్లు రచ్చిపోయారు.
అన్షులాకీ కావాలనే తన అక్కసును వెల్లగక్కిందని శ్రీదేవి ఫ్యాన్స్ ఒక్కసారిగా నెగటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. అక్క అన్షులాకిపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ రావడంతో జాన్వీ తట్టుకోలేకపోయింది.
సోషల్ మీడియాలో మూర్ఖంగా ప్రవర్తించడం సరికాదని జాన్వీ మండిపడింది. సోషల్ మీడియాలో చాలావరకు మానసిక రోగంతో బాధపడేవారు ఉన్నారని, తన సోదరిపై రేప్ చేస్తామంటూ అభ్యంతరకర పోస్టులు చేసినట్లు చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదని జాన్వీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.