మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:25 IST)

తిరుపతిలో సంప్రదాయబద్ధంగా నా పెళ్లి : జాన్వీ

వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దఢక్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె క్రేజ్ సంపాదించుకుంది. పైగా, ఫొటోషూట్లతో కూడా జాన్వీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భవిష్యత్‌లో జరగబోయే తన పెళ్లి గురించి స్పందించింది. తాను తిరుపతిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. 
 
తన జీవితంలో అన్నీ సహజంగా జరగాలని కోరుకుంటానని తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాది స్పెషల్స్ ఉంటాయని మీడియా ప్రతినిధులకు నోరూరిపోయేలా లిస్టు చదివి వినిపించింది. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి, పని పట్ల నిబద్ధత ఉన్న వాడినే తాను మనువాడతానని జాన్వి పేర్కొంది.