మమ్మల్ని పిచ్చోళ్ళను చేయొద్దు - నరేష్ తవ్విన గుంటలో విష్ణు పడిపోయాడుః జీవిత రాజశేఖర్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం ఇంకా రేపటితో ఆఖరు. ఈనెల 10వ తేదీన ఫిలించాంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రకరకాల వ్యక్తులు ఎలక్షన్ల తీరుపై, సభ్యుల కోపతాపాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా టీవీ5 అనే ఛానల్‌లో సభ్యులతో చేస్తున్న చర్చలు తప్పొదోవ పట్టిస్తాయని జీవిత రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారంనాడు ఓ చర్చలో ఆమె పాల్గొంది.
`మా`లో 920 వరకు సభ్యులున్నారు. మనమంతా ఒకే కుటుంబం ఎందుకు ఈ గొడవలు. మంచి చేయాలనుకుంటే చేయండి. ఎందుకు ఈ తాయిలాలు అని జీవిత ప్రశ్నిస్తోంది.
ప్రతి సభ్యుడు న్యాయానికి ఓటు వేయండి. శివబాలాజీ మంచి వర్కర్. నిజం మాట్లాడండి. ఎందుకన్ని అబద్దాలు టీవీలో చెపుబుతున్నారు. ఎలక్షన్ అయ్యేంత వరకు నేను ఏమీ అనను. వారు మాట్లాడేది తప్పు. ఆ తర్వాత వ్రూప్ చేస్తా. మాది తప్పంటారా చెప్పుతో కొట్టండి. ఇక ప్రకాష్‌రాజ్ గురించి మాట్లాడుతున్నారు.. జయలలిత, ఎం.జి.ఆర్.. కరుణానిధి, ఇలా అందరూ ఎక్కడినుంచో వచ్చి పాలించారు. కళకు భాష బేధం లేదు.
అందరూ బ్రాండ్ మైండెడ్ గా వుండండి. ప్రకాష్ రాజ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పని చేస్తానని తొలుత ముందుకు వచ్చాడు. మంచు విస్ణు కుటుంబం నాకు సన్నిహితం. వారిని చూసి జాలి పడుతున్నాం. నరేష్ తవ్వుతున్న గుంటలో వారు పడిపోతున్నారు. నేను ప్రకాష్‌రాజ్ పేనల్‌లో వున్నా. నరేష్ పనిచేయలేదని అనడంలేదు. స్వార్థంతో చేస్తున్నాడు. సెలక్టడ్‌గా కొందరికే ఆయన సాయం చేస్తున్నాడు. 900 మందికి మంచి చేయండి. నాకు చాలా పనులు వున్నాయి. నేను, నా భర్త, కుమార్తెలు కస్టపడితేనే కానీ కుటుంబం సాగదు. మంచి కోసం పోరాడుతున్నాం. మమ్మల్ని పిచ్చోళ్ళను చేయకండి. గతంలో `మా` ఫండ్ రైజింగ్ అనుకున్నాం. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. ఏదైనా ఎలక్షన్ల తర్వాత నేను అన్నింటికి సమాధానం చెబుతాను అని తెలిపారు.