'జిగేలు రాణి'కి అదిరిపోయే బహుమతి ఇచ్చిన సుకుమార్

రంగస్ధలం సినిమాలో జిగేలు రాణి ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పనవసరం లేదు. జిగేలు రాణిగా ఐటం సాంగ్ చేసిన పూజా హెగ్డేకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ పాట పాడిన గాయనికి మాత్రం అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సామాజిక, ప్రసార మాథ్యమాల్లో ప్రచారం జరిగిం

charan-Pooja
TJ| Last Modified శనివారం, 21 జులై 2018 (14:04 IST)
రంగస్ధలం సినిమాలో జిగేలు రాణి ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పనవసరం లేదు. జిగేలు రాణిగా ఐటం సాంగ్ చేసిన పూజా హెగ్డేకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ పాట పాడిన గాయనికి మాత్రం అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సామాజిక, ప్రసార మాథ్యమాల్లో ప్రచారం జరిగింది. వెంకటలక్ష్మి అనే నిరుపేద కుటుంబానికి  చెందిన మహిళ ఆ పాటను పాడింది. అయితే మధ్యవర్తులు ఆమెకు డబ్బులివ్వకుండా మోసం చేశారు. దీంతో వెంకటలక్ష్మి తన ఆవేదనను సామాజిక మాథ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసింది.
 
వారంరోజుల పాటు వెంకటలక్ష్మి ఆవేదన వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా సినిమా దర్శకుడు సుకుమార్‌తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లు చూశారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న సుకుమార్ మధ్యవర్తిని పిలిపించి ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు. ఆ తరువాత వెంకటలక్ష్మి బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను కనుక్కుని నేరుగా ఆమె అకౌంట్‌లోకి డబ్బులు పంపారు.
 
అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 10 లక్షల రూపాయలు. ఒక పాటకు ఇంత మొత్తంలో డబ్బులు తీసుకున్న వెంకటలక్ష్మి ఆశ్చర్యపోయారట. ఆలస్యంగానైనా తన పాటకు ఇంత మొత్తంలో డబ్బులు ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు వెంకటలక్ష్మి.దీనిపై మరింత చదవండి :