గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (15:00 IST)

ప్రజల కోసం పనిచేసిన జితేందర్ రెడ్డిని దారుణంగా చంపింది ఎవరోతెలుసా: కిషన్ రెడ్డి

jitendar reddy team with kishanreddy
jitendar reddy team with kishanreddy
ఎ.బి.వి.పి. సంస్థకు చెందిన కాలేజీ నాయకుడు జగిత్యాలలో చుట్టు పక్కల ప్రజల సమస్యలకోసం పోరాడేవాడు. అలాంటి వ్యక్తిని అతి దారుణంగా  72 బుల్లెట్లతో కాల్చిచంపడం వెనుక నగ్జలైట్ల హస్తమా? లేక ఆయన ఎదుగుల ఓర్వలేక పోటీ నాయకులే చంపారా? అనేది తెలియాలంటే జితేందర్ రెడ్డి సినిమా చూడాల్సిందే. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’.

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 8న ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రాన్ని నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చూసి జితేందర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ : గతంలో నేను జితేందర్ రెడ్డి కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసాము. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారు. ఆయన అప్పట్లోనే పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను సంఘటితం చేసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ల కోసం నిలబడిన వ్యక్తి. జాతీయ భావజాలంతో, వీరోచిత పోరాట పటిమతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి. 
 
వరంగల్ లో అప్పట్లో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారి సభకు తనవంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి 50 బస్సుల ద్వారా పేద ప్రజలను, యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్ ని విజయవంతం చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా వెనుతిరగకుండా ప్రజల కోసం ప్రజలతో ఉంటూ పోరాటం చేసిన వ్యక్తి. 72 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దింపి నక్సలైట్లు అయినను ఏవిధంగా హత్య చేశారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. 
 
హింస ద్వారా ఏది సాధించలేము అని చెప్పడమే ఆయన ప్రయత్నం. ఇప్పటికీ ఎంతోమంది తుపాకుల ద్వారా హింస ద్వారా అనుకున్నది సాధించవచ్చు అనుకోవడం తప్పు, ఆలోచన మార్చుకోవాలి అనే విధంగా ఉంది ఈ సినిమా. జితేందర్ రెడ్డి తండ్రిగారైన ముదిగంటి మల్లారెడ్డి గారు సాత్విక స్వభావులు. తన కుమారుడు పోరాటంలో చనిపోతాడు అని తెలిసి కూడా ఆయన ఎక్కడా అడ్డుకోకుండా ప్రజల కోసం నిలబెట్టిన వ్యక్తి. ఈ రోజున  రవీందర్ రెడ్డిగారు తన సోదరుడైన జితేందర్ రెడ్డి యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలి అనుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా మంచి విషయం. ముఖ్యంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఇంత చక్కగా దర్శకత్వం వహించినటువంటి విధించే వర్మ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని చెప్పడం జరిగింది. కావున నక్సలైట్లు నక్సలిజం వదిలిపెట్టి ప్రజాస్వామ్యం వైపు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.