శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 జనవరి 2023 (18:30 IST)

జూ.ఎన్టీఆర్ 30 మూవీ అప్‌డేట్ ఇదే... దర్శకుడు ఎవరంటే?

ntr30 movie updates
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వచ్చే ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం గురించి అప్‌‍డేట్‌ను వెల్లడించారు. 
 
ఈ యేడాది ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మూవీని యువసుధ ఆర్ట్స్‌తో కలిసి హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 
 
కాగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. దీంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు నుంచి కొరటాల శివను తప్పించారన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే, తాజాగా ట్వీట్‌‍లో ఈ పుకార్లకు చెక్ పెట్టేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది.