గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (23:46 IST)

బాలయ్యకు జూనీయర్ ఎన్టీఆర్ ఛాలెంజ్, నట సింహం స్వీకరిస్తాడా?

నందమూరి ఫ్యామిలో బాబాయ్ బాలకృష్ణ - అబ్బాయ్ జూనీయర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ ఉందనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు టైటిల్‌తో బాలయ్య నిర్మించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో జూనీయర్ ఎన్టీఆర్‌తో యంగ్ ఏజ్‌లోఎన్టీఆర్ పాత్ర చేయిస్తారని వార్తలు వచ్చాయి కానీ.. తారక్‌ని బాలయ్య ఈ సినిమాలో నటించమని అడగకపోవడం.. తారక్ నటించకపోవడం తెలిసిందే. 
 
వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కారణంగానే బాలయ్య అడగలేదని.. ఆ కారణంగా తారక్ నటించలేదని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే.. మన ఇంటిని శుభ్రం చేసి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. దర్శకధీరుడు రాజమౌళికి ఇవ్వడం.. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి.. పూర్తి చేసి రాజమౌళి ఈ ఛాలెంజ్‌ను ఎన్టీఆర్‌కు ఇవ్వడం తెలిసిందే. రాజమౌళి ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, కొరటాల శివకు ఈ ఛాలెంజ్‌ను విసిరిన సంగతి తెలిసిందే. 
 
ఎన్టీఆర్.. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌‌లతో పాటు రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివకు ఈ ఛాలెంజ్ ఇవ్వడం అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా బాబాయ్ బాలయ్యకు ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ ఇవ్వడమనేది నందమూరి అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియులందరిలో ఆసక్తిగా మారింది. అయితే.. బాలయ్యకు ట్విట్టర్లో అకౌంట్ లేదు. మరి.. ఈ విషయం తెలుసుకుని బాలయ్య తారక్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తాడా..? లేదా అనేది చూడాలి.